రాయదుర్గం: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు, గొడిశలపల్లి సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
విద్యుత్ కోతలతో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ను శనివారం ముట్టడించారు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, దీంతో వరి, వేరుశనగ మొక్కజొన్న, మిరప, ఇతర పంటలకు నీరు అందక పొలాలు ఎండుతున్నా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొడిశలపల్లి, గనిగెర, అంబాపురం, బాదనహాల్ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్దకు తరలివచ్చి విద్యుత్ అధికారులను నిలదీశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, వెంటనే విద్యుత్ సరఫరాను సక్రమంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.