రాయదుర్గం: కూటమి అభ్యర్థులను గెలిపించండి : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. గురువారం రాయదుర్గం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పొత్తులో భాగంగా బీజేపీకి 2(9వ వార్డు నాగరత్నమ్మ, 37 భాగ్యమ్మ), జనసేనకు 3 వార్డులు కేటాయించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రానికి నిధులు, పవన్ సహకారంతో అభివృద్ధి జరుగుతోందని, కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధర పాల్గొన్నారు.