దర్శి: దర్శి నగర పంచాయతీ పరిధిలో ఎన్నికలకు సిద్ధం చేస్తున్న అధికారులు
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు శరవేగంగా చేపట్టారు. అందులో భాగంగా అందుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని ఎన్నికల అధికారులు ప్రకటించారు.