రాయదుర్గం: పులకుంట, వీరాపురం గ్రామాలలో ఘనంగా శ్రీ కృష్ణ జయంతి ఉత్సవాలు
గుమ్మగట్ట మండలంలోని పులకుంట, వీరాపురం గ్రామాలలో శ్రీ కృష్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత రెండు రోజుల క్రితం విగ్రహాలను, శ్రీకృష్ణుడి చిత్రపటాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వందలాది యాదవవులు చిత్రపట ఊరేగింపు నిర్వహించారు. యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బంగి ఉమాశంకర్. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు జి. పరమేశ్వరప్ప, నియోజకవర్గ ఉపాధ్యక్షులు దుద్దేకుంట తిమ్మరాజు, గుమ్మగట్ట మండల అధ్యక్షులు పులకుంట బాలయ్య, ఉపాధ్యక్షులు దేవరెడ్డిపల్లి వెంకటేషులు, అమరీష్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.