రాయదుర్గం: మల్లాపురం లేఅవుట్ సమీపంలో అందుబాటులోకి రానున్న నూతన సబ్ స్టేషన్
రాయదుర్గం పట్టణ శివారులోని మల్లాపురం రోడ్డులో కొత్తగా 33/12 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. నూతన సబ్ స్టేషన్ లో అధికారులు, నిపుణులు మంగళవారం పూజలు నిర్వహించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కన్ట్రక్షన్ ఈఈ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రూ. 2.80 కోట్లతో నిర్మించిన ఈ సబ్ స్టేషన్లతో పట్టణంలోని శాంతినగర్. మల్లాపురం లేఅవుట్, టిడ్కో ఇళ్ల ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడానికి వీలవుతుందని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటామనానారు.