రాయదుర్గం: నాడు నన్ను ఊరి నుంచి తరిమేయాలని చూశారు, నేడు ప్రశాంతంగా ఎన్నికలు : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
గత మున్సిపల్ ఎన్నికల్లో వాటి వైసిపి పాలకులు మాపై దౌర్జన్యం చేసి ఊరి నుంచి తరిమేయాలని చూశారని ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ నేడు వైసిపి నాయకులు ప్రశాంతంగా నామినేషన్ వేసి స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రాయదుర్గంలో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.