రాయదుర్గం: వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దు : డిప్యూటీ ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి
వన్యప్రాణులకు ఎవరూ హాని తలపెట్టవద్దని రాయదుర్గం ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి కోరారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జరుగుతున్న వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా శనివారం రాయదుర్గం నగరవనంలో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పక్షులు, జంతువులు, జీవకోటి అంతా ప్రకృతి సమతుల్యతలో భాగమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అడవులను నరకడం, వేటాడడం, వన్యప్రాణుల అక్రమ రవాణా వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులకు హాని తలపెట్టినా, వేటాడినా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.