గిద్దలూరు: గిద్దలూరులో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ లో తిలకించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, రైతులు
ప్రకాశం: గిద్దలూరులో శుక్రవారం ఉద్యానవన పంటలను ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. మదనపల్లిలో నేడు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ మాస్టర్ ప్లాన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో కలసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ లో రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే తిలకించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లక్ష కోట్లతో రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.