కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాకం వల్ల తౌశిక్, మౌలాభి ప్రాణాలు కోల్పోయారన్న ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ
ప్రకాశం: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాకం వల్ల తౌశిక్, మౌలాభి ప్రాణాలు కోల్పోయారని వారి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అధికారులు డిమాండ్ చేశారు. వారి మరణానికి కారణమైన వారిని ఎస్సై నుంచి ఎస్పీ వరకు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.