యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లో గల్లంతైన ఇద్దరు యువకుల్లో వినయ్ మృతదేహం లభ్యం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు పీడర్ కెనాలలో గల్లంతైన ఇద్దరి యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. పెద్దారవీడు మండలం సుంకేసుల సమీపంలో ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. మరో యువకుడు రాజ్ కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.