గిద్దలూరు: గిద్దలూరులో తమ వేతనాలు పెంచాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన అంగన్వాడీలు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని కోరారు.