కొండపి: గాంధీ జయంతి రోజున ఇష్టానుసారంగా మాంసం విక్రయాలు, ముందస్తు హెచ్చరికలు అధికారులు జారీచేసిన లెక్కచేయని వ్యాపారులు
ప్రకాశం: అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మాంసం, మద్యం విక్రాయాలపై అధికారులు నిషేధం విధించారు. అయితే ఒంగోలు పట్టణంలో కొంత మంది మాంసాహార విక్రయ దారులు నిబంధనలు ఉల్లంఘించి మాంసాన్ని విక్రయించారు. ముందస్తుగా అధికారులు హెచ్చరించిన వ్యాపారస్తులు లెక్క చేయలేదు. గాంధీ జయంతి రోజు మాంసాన్ని విక్రయించిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.