యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలో ఉద్రిక్తత: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా
యర్రగొండపాలెంలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో టీడీపీ నాయకుల దాడులు, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించింది. అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.