మరిపెడ: మరిపెడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. పారదర్శకంగా రేషన్ సరుకులు
మరిపెడ మండలం వీరారం గ్రామంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్ మాట్లాడుతూ, ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.