యర్రగొండపాలెం: గణపవరం గ్రామంలో 1.10 కోట్ల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు రోడ్లు వేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 1.10 కోట్ల నిధులతో నూతన సిసి రోడ్ల నిర్మాణానికి టిడిపి ఇన్చార్జి శంకుస్థాపన చేశారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.