రాయదుర్గం: వైభవంగా నేమకల్లు ఆంజనేయస్వామి రథోత్సవం
బొమ్మనహాల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నేమకల్లు ఆంజనేయస్వామి రథోత్సవం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాదీ శ్రావణ మాసం చివరలో స్వామి వారి ఉత్సవాలు, రథోత్సవం ఇక్కడ నిర్వహిస్తారు. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో స్వామి వారి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి రథాన్ని లాగారు. శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. బొమ్మనహల్ పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.