రాయదుర్గం: మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి టంకశాల హనుమంతు కు పార్టీ బి ఫారం
రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టంకశాల హనుమంతు బి ఫారం అందజేశారు. మంగళవారం ఉదయం పార్టీ పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, పూజారి సీనియర్ నాయకులు శివప్రసాద్ తో కలసి వెళ్లి ఈఓ సూర్యప్రతాప్ కు బి ఫారం అందజేశారు. కూటమి పొత్తులో టిడిపి కి సీటు కేటాయించారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ఎమ్మెల్యే కార్యాలయానికి బి ఫారాలు అందజేశారు.