రాయదుర్గం: పట్టణంలో పరిశీలన అనంతరం ఛైర్మన్ - 10, కౌన్సిలర్ల కు 202 నామినేషన్లు అర్హత
రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సోమవారం ప్రశాంతంగా జరిగింది. చైర్మన్ స్థానానికి 16 నామినేషన్లు రిగా పరిశీలన అనంతరం అర్హత కలిగిన నామినేషన్లు 10 మిగిలాయి. అలాగే 40 వార్డులకు గాను 277 నామినేషన్లు రాగా అర్హత కలిగిన నామినేషన్లు 202 గా ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థులలో టిడిపి 3, వైసీపీ 2, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బిఎస్పి, బిసివై, ఇండిపెండెంట్ ఒకటి చొప్పున అర్హత సాధించిన వాటిలో ఉన్నాయి. ఇక కౌన్సిలర్ స్థానాల్లో టిడిపి 90,వైసీపీ 68, కాంగ్రెస్ 10 బిజెపి 9,జనసేన 10, ఎంఐఎం 3, బిఎస్పి 1 బిసివై-1, ఆమ్ ఆద్మీ 1, సిపిఐ - 1 ఉన్నాయి.