రాయదుర్గం: గుమ్మగట్ట మండలంలో విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్ల చోరీలతో రైతులు తీవ్ర ఆందోళన
గుమ్మగట్ట మండలంలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్ల చోరీతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బేలోడు గ్రామానికి చెందిన చౌలూరు మారుతి పొలంలో రెండు పంపు సెట్ మోటార్ల విద్యుత్ కేబుల్ వైర్లు అర్ధరాత్రి సమయంలో దొంగలు కత్తిరించి దోచుకెళ్లారని బాదిత రైతు తెలిపారు. గత 10 రోజుల క్రితం గోపాల్ అనే రైతూ పొలంలోనూ వైర్లు కత్తిరించి ఎత్తుకుపోయారు. వరుస సంఘటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దొంగలను పెట్టుకోవాలని కోరారు.