నారాయణపేట్: మిషన్ భగీరథ నీటి కష్టాలు: 15 గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేతపై కలెక్టర్ సీరియస్
వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోటకొండ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్యపై సీపీఎం నాయకులు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.