కురవి: మహబూబాబాద్: ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో 75 ఏళ్ల బుర్ర యశోద అనే వృద్ధురాలు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. దాదాపు మూడు, నాలుగు రోజుల క్రితమే ఆమె మరణించి ఉంటారని అనుమానం. బుధవారం విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.