కురవి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్, 75వేల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్న కురవి పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పల్సర్ వాహనంపై అక్రమంగా ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు .వారి వద్ద నుండి సుమారు 75 వేల రూపాయల విలువగల 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కురవి పోలీస్ స్టేషన్లొ నిర్వహించిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ సర్వయ్య వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.