కురవి: కురవి వినాయక జ్యువెలరీ షాప్ లో చోరి కేజిన్నర వెండి 12 గ్రాముల బంగారం చోరీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో దొంగలు హల్ చల్ చేసారు, షాపు వెంటిలేటర్ పగలగొట్టి చెట్టుకొమ్మనే నిచ్చనగా మార్చుకొని షాప్ లోకి జొరబడి కేజీన్నర వెండి.12 గ్రాముల బంగారం చోరీ చేసారని బాధితుడు వీరన్న తెలిపారు.కొరవి ఎస్ఐ సతీష్ వెంటనే షాప్ ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తో పరిశీలించి వేలిముద్రలు ఆధారాలు సేకరించారు, చోరీకి గురైన సొత్తు సుమారు ముడున్నర లక్షల విలువ ఉంటుందని బాధితుడు వీరన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు