కురవి: రాజోలు లో సిపిఐ నాయకుడు శ్రీనివాస్ మృతిచెందగా,వారి కుటుంబాన్ని పరామర్శించిన ,కొత్తగూడెం ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు
విద్యార్థి దశ నుండి సైదాంతిక నిబద్ధత గల మంచి నాయకున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు అన్నారు. కురవి మండలం రాజోలులో ఇటీవల మృతి చెందిన సిపిఐ నాయకులు పోగుల శ్రీనివాస్ కుటుంబాన్ని కూణంనేని సాంబశివరావు పరామర్శించారు .వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.