కురవి: కురవి మండల కేంద్రం శివారులో అదుపుతప్పి బోల్తా పడిన ధాన్యం లారీ
వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్న ఓ లారీ కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద శనివారం మధ్యాహ్నం అదుపు తప్పి బోల్తా పడింది. సీరోలు కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల బస్తాలతో మహబూబాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పిలుచుకున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.