కొండపి: పొన్నలూరులో ఎస్ఐపై దాడి: నామినేషన్ల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా పొన్నలూరులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో ఎస్ఐ రాజేష్‌పై వైసిపి కార్యకర్తల దాడి జరిగింది. ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేపట్టి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్లు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని ఎస్పీ పేర్కొన్నారు.