గిద్దలూరు: ఉమ్మడి జిల్లాలో పెరిగిన తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, 40 డిగ్రీలు వరకు చేరే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెరిగిన తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఏకంగా 39 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రత ఉక్కపోత పెరగడంతో ప్రజలు ఏసీలు ఫ్యాన్లు వినియోగం విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే మధ్యాహ్నం పూట పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు.