గిద్దలూరు: కొమరోలులో సిపిఎం నాయకులపై దాడి, ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కొమరోలులో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సిపిఎం నాయకురాలు అంజమ్మ, నాయకుడు ఆవులయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన ఆవులయ్య గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.