యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి, బీ చెర్లోపల్లి గ్రామాలలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కళాజాత బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవి జంతువులు జనావాసాలకు వచ్చినప్పుడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిల్లలకు చిన్నతనం నుండే జంతువుల ప్రాముఖ్యత జంతువుల పట్ల దయ కలిగి ఉండడాన్ని నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.