బుగ్గారం: బుగ్గారం పోలీసులకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు - అసలేం జరిగింది?
జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజీ ఇవ్వలేదని బాధితుడు చుక్క గంగారెడ్డి కమిషన్ను ఆశ్రయించారు. ముగ్గురు ఎస్ఐల వ్యవహారశైలిపై విమర్శలు వస్తుండగా, నవంబర్ 17న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.