బుగ్గారం: బుగ్గారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందని తెలిపారు.