బుగ్గారం: సిరికొండలో ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం
బుగ్గారం మండలం సిరికొండం గ్రామంలో ధర్మపురి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్ రిబ్బన్ కట్ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలం తొలకరిలో పశువులకు సోకే వ్యాధుల నివారణపై రైతులకు వైద్యాధికారులు అవగాహన కల్పించారు.