బుగ్గారం: గోపులాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన విప్ అడ్లూరి
బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు రూ.20 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు.