బుగ్గారం: సమస్యల వలయంలో మద్దునూరు గ్రామం, అభివృద్ధి పనులు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవారం మధ్యాహ్నం ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల అక్షయ్ కుమార్ సోమవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో ఒక్క ఆశ వర్కర్ కూడా లేరని, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయని తెలిపారు.