రాయదుర్గం: రాయదుర్గం మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పాల్గొన్న ఎమ్మెల్యే తనయ
రాయదుర్గం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి చేస్తున్నారని ఆయన తనయుడు, టీడీపీ యువనేత కాలవ భరత్ తెలిపారు. వడ్రహొన్నూరు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండల కన్వీనర్ కురుబ హనుమంతు నామినేషన్ లో ఆయన పాల్గొన్నారు. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.