కొండపి: కొండపిలో 229 మందికి ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి స్వామి
కొండపి మండలంలో 229 మంది లబ్ధిదారులకు పీఎంఎవై ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి స్వామి అందజేశారు. ఒక్కో ఇంటికి రూ. 2.89 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కొండపి నియోజకవర్గంలో 6,333 మంది అర్హులు ఉన్నారని, త్వరలో మరిన్ని ఇళ్లు కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.