రాయదుర్గం: 75 వీరాపురం లో వెసిపి లో చేరికలు
గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో గుర్తింపు లేకపోవడం, సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడంతో పార్టీ మారుతున్నట్లు ముద్దలపురం రమేష్, కిష్టప్ప లింగప్ప, రవి, ఉమేష్ తదితరులు తెలిపారు. మెట్టు గోవిందరెడ్డి, జగన్ నాయకత్వంపై విశ్వాసంతో వైసిపిలో చేరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఈసి మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు.