ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ మహిళా పోలీసులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహిళా రిలేటెడ్ సమస్యలపై సలహాలు, సూచనలు చేశారు. శక్తి యాప్ డౌన్లోడ్ గురించి చర్చించారు. మహిళలపై జరుగుతున్న నేరాల గురించి గ్రామాల్లో, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా పోలీసులకు ఆదేశించారు.