తొర్రూర్: తోర్రూరులో ఘనంగా పోలీస్ అమర వీరుల వారోత్సవ సైకిల్ ర్యాలీ
అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా తోర్రూరులో డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల్లో పోలీసు సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.