తొర్రూర్: హత్తేపురం స్టేజి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న గ్రానైట్ లారీ ,గ్రానైట్ లారీ డ్రైవర్ మృతి
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూర్ మండలం పత్తేపురం స్టేజీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వచ్చిన గ్రానైట్ లారీ ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ బాల్రాజు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.