తొర్రూర్: తొర్రూర్‌లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఎం ధర్నా
అర్హులైనవా పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని, స్థానిక ప్రజలు ధర్నాకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.తొర్రూరు మండల కేంద్రంలో గత బి.ఆర్.యస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ, గత మూడు రోజులుగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు నేరుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్లి నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి అర్హులైన పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని, వారి సందర్భంగా కోరుతూ నినాదాలు చేశారు.