తొర్రూర్: తొర్రూర్ మున్సిపాలిటీకి నూతన వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తోరూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై,నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.తోరూర్ పట్టణం శుభ్రంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం ఉందని ,ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఈ వాహనాలు కచ్రా వాహనాలు ,వాటర్ ట్యాంకర్లు ఇతర ఉప యుక్త వాహనాలు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడుతాయని అన్నారు.