తొర్రూర్: నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులకు అన్యాయం: తొర్రూరులో జనసేన ఇన్చార్జి నగేష్
పాలకుర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరిగిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నగేశ్ ఆరోపించారు. గురువారం తొర్రూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను లబ్ధిదారుల లిస్ట్ అడిగితే ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడిన వారిపై కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.