తొర్రూర్: సంక్షేమ పథకాల పంపిణీలో దేశంలోని తెలంగాణ ముందుంది, తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్
సన్న బియ్యం, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ,రైతు భరోసా, సబ్సిడీపై సిలిండర్లు, జీరో కరెంట్ బిల్లు ,తదితర పథకాల తో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తోరూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ అన్నారు. దంతాలపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.