దర్శి: దర్శి లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ముగ్గురికి జరిమానా ఒకరికి జైలు శిక్ష
ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా నలుగురు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు ముగ్గురికి పదివేల రూపాయలు జరిమానా విధించి ఒకరికి 15 రోజులు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఇప్పటికైనా మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సీఐ రామారావు హెచ్చరించారు.