రాయదుర్గం: డ్రోన్, సిసి కెమెరాలతో నామినేషన్ కేంద్రాల వద్ద నిఘా : డిఎస్పీ టిడి ప్రసాద్
ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ టిడి ప్రసాద్ తెలిపారు. బుధవారం రాయదుర్గం ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న మెదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. మీడియా మాట్లాడుతూ ఇతరుల కు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే సహించే ప్రసక్తే లేదని, అల్లర్లు సృష్టిస్తే రౌడీషీట్లు నాన్ బెయిలబుల్ కేసులు తప్పవన్నారు. నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చని తెలిపారు. సిఐ దేవానంద్, ఎంపిడివో కొండన్న పాల్గొన్నారు.