గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు కసరత్తు, పోస్ట్ బ్యాలెట్ బాక్స్‌లను మున్సిపాలిటీ తరలించిన అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. గతంలో 20 వార్డులుగా ఉన్న గిద్దలూరు మున్సిపాలి ప్రస్తుతం 28 వార్డులగా రూపాంతరం చెందింది. హైకోర్టు కూడా ఆరు వారాల్లో స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు గిద్దలూరు మున్సిపాలిటీకి పోస్ట్ పైలెట్ బాక్సులను శనివారం తరలించింది. దీంతో స్థానిక ఎన్నికలు అతి త్వరలో జరుగుతాయని సంకేతాలు అందుతున్నాయి.