రాయదుర్గం: నియోజకవర్గంలో 15 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
రాయదుర్గం నియోజకవర్గంలోని 15 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కాయి. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవార్డులు అందుకోనున్నారు. రాయదుర్గం మండలం నుంచి కొంతానపల్లి పాఠశాల పద్మావతి, ఆవులదట్ల హైస్కూల్ పుష్పవేణి, రాయదుర్గం గర్ల్స్ హైస్కూల్ నాగరాజు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. గుమ్మగట్టలో ముగ్గురు, కణేకల్లులో ఆరుగురు, బొమ్మనహాల్‌లో ముగ్గురు ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్‌గా ఎంపికయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపు లభించడంతో విద్యా వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.