యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రిపురాంతకం పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందజేస్తున్న బియ్యం గుడ్లు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మల్లికార్జున నాయక్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.