రాయదుర్గం: ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా చిన్ననాటి గురువుకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా చిన్ననాడు తనకు చదువు చెప్పిన గురువును స్మరించుకుని ఆయన సమాధి వద్ద రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని రుద్రభుమికి వెళ్లి గురువు పక్కీరప్ప సమాధి వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జ్ఞానాన్ని ఇస్తారని తెలిపారు.